పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థిని గెలిపించుకుందాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ
టిడిపి అభ్యర్థిని గెలిపించుకుందాం.
తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 28(రవి కిరణాలు):-
తెలుగుదేశం పార్టీ, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, అత్యధిక మెజారిటీతో
గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట కార్యాలయం నందు మంగళవారం. క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జి, మండల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుతొట రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్,గండవరం రమేష్ రెడ్డి. పట్టణ వార్డ్ ఇన్చార్జులు తదితరులు
పాల్గొన్నారు.