స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇస్తున్నారు. గంటకుపైగా సాగుతున్న వీరిభేటీలో.. ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని ఈసీకి తెలిపినట్లు సమాచారం. వీరి సమావేశం ముగిసిన అనంతరం భేటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.