ప్రభుత్వం రైతులకు సబ్సిడీ తో ఇచ్చే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి:- ఏ డి. ఏ జి. అనిత
ప్రభుత్వం రైతులకు సబ్సిడీ తో ఇచ్చే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి:- ఏ డి. ఏ జి. అనిత
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సూళ్లూరుపేట మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మంద. దేవేంద్రరెడ్డి గారి అధ్యక్షతన మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్ జన్మదినం మరియు రైతు దినోత్సవం అయిన ఈ నెల 08 వ తేదీన సూళ్లూరుపేట ఏ ఎం సి ఆవరణలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీ కిలివేటి సంజీవయ్య ప్రారంభించబడిన నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను రైతులు వినియోగించుకొని మట్టి, ఎరువులు మరియు పురుగుమందులు ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చునని, పశువులకు సంబంధించిన పాలు, రక్తం పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చునని అలాగే ఖరీఫ్ పంటకు నీరు అవసరం అయితే తెలుగుగంగ నీరు అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఖరీఫ్ కు తెలుగుగంగ నీరు ఇచ్చిన ఘనత మన సీఎం జగనన్న కే దక్కుతుందని రైతులు అందరు ఈ ఖరీఫ్ లో వారు సాగు చేసే పంటలను వి ఏ ఏ ల దగ్గర ఈ పంట నమోదు చేసువాలి అని,పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలు సబ్సిడీ తో వచ్చేవారం పంపిణీ చేస్తామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏ డి ఎ గుమ్మడి. అనిత మాట్లాడుతూ మండలంలో చదువుకున్న ఆసక్తి గల పాస్ పోర్ట్ కలిగిన యువ రైతులు ఉచితంగా డ్రోన్ పైలట్ ట్రైనింగ్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఎం ఏ ఓ కవితగ , ఏ ఏ బి సభ్యులు పెదపాపు. రామచంద్రయ్య , సోమసుందరం, సర్పంచ్ లు తేరే. కృష్ణయ్య గ, బుంగా. చెంగయ్య , వాటంబేటి. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.