అంగరంగ వైభవంగా పోలీస్ శాఖ నుండి అమ్మణ్ణికి సారె..
తిరుపతి జిల్లా,సూళ్లూరుపేట:-
పట్టణంలో కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగు బంగారం, దక్షిణ ముఖ కాళీ, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో జరుగుతున్నశరన్నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మణికి తొమ్మిదవ రోజు సాయంత్రం పోలీస్ శాఖ నుండి అంగరంగ వైభవంగా అమ్మణ్ణికి సారె ను తీసుకొచ్చారు. ముందుగా ఆలయ అర్చకులు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి పూజలు నిర్వహించి సారెను పేట ఎస్ ఐ పి.రవిబాబు, శ్రీహరి కోట ఎస్ ఐ ఎస్. కె. జిలాని భాషా, ఎ ఎస్ ఐ లు కె. వెంకటేశ్వర్లు,వేణు, డి. సుబ్రమణ్యం మరియు పోలిసులు కాలి నడకన కుటుంబ సభ్యులతో కలిసి సారెను తలపై పెట్టుకుని మేళతాళాలతో , డప్పువాయిద్యాలతో,వీరజాటీలతో ఊరేగింపుగా బయలుదేరి
ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద కు గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు వారికి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికి అమ్మణ్ణి సారెను అందజేశారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సారెను తలపై పెట్టుకొని అలయం లోనికి ప్రవేశించారు . ముందుగా అమ్మణ్ణి చెట్టువద్దకు చేరుకుని పూజలు చేసిన అనంతరం ఆలయంలోని అమ్మణ్ణి సన్నిధిలోకి చేరుకొని అమ్మణ్ణి కి సారెను స్వయంగా సమర్పించారు. అనంతరం చైర్మన్, ఈవో డిఎస్పీని, ఎస్ఐలను, ఏఎస్ఐ లను శాలువాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
ఈకార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్ , మాజీ పాలకమండలి సభ్యులు గోగుల తిరుపాలు, వైయస్ఆర్ సీపీ నాయకలు కళ్ళత్తూరు జనార్థన్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.