తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా నెల్లూరు గ్రామ దేవత అయిన  శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి నగర ఉత్సవం కనుల పండువగా  సాగింది. ఉగాది మహోత్సవం సందర్భంగా అమ్మవారి నగరోత్సవానికి  వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గౌరవ  నెల్లూరు పార్లమెంటు సభ్యులు, రూరల్ ఇన్చార్జి  శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి  ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  అమ్మవారి నగరోత్సవ ఏర్పాట్లను విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. అమ్మవారి నగరోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయన దగ్గరుండి ఏర్పాట్లను  నిర్వహించారు. రెండేళ్ల క్రితం కరోనా వచ్చిన నేపథ్యంలో తొలిసారిగా ఉగాది మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవస్థానం పాలకమండలి అధ్యక్షతన అన్ని శాఖల అధికారుల సమన్వయంతో  అమ్మవారి నగరోత్సవాన్ని వైభవపేతముగా నిర్వహించారు. నగర ఉత్సవంలో పాల్గొనేందుకు నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి కూడా భక్తజనులు హాజరు కావడం విశేషం. అమ్మవారి నగరోత్సవానికి  వేలాది మంది భక్తులు విచ్చేయడంతో ఆ ప్రాంతమంతా భక్తజనులతో కిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, దేవస్థానం పాలక మండలి కమిటీ చైర్మన్ రావు( ఆర్ ఎస్ ఆర్ ) శ్రీనివాసరావు, కార్పొరేటర్లు కువ్వకోలు  విజయలక్ష్మి, యాకసిరి శరత్చంద్ర, వివిధ  శాఖల అధికారులు, దేవస్థానం పాలక మండలి సభ్యులు,  వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.