తిరుపతి జిల్లా...బాలాయపల్లి మం  

సుబ్రహ్మణ్యం గ్రామ సమీపంలో ఈతకు వెళ్ళి యువకుడి మృతి   మృతి చెందిన యువకుడు వినయ్  నాని(14)  ఆలస్యంగా అందిన సమాచారం మేరకు బాలాయపల్లికి చెందిన  దాసరి శ్రీనయ్య కొడుకు అయిన వినయ్ నాని అనే యువకుడు బాలాయపల్లి ప్రభుత్వ పాఠశాల లో 9వ తరగతి చదువుతూ ఉన్నాడు.. ఇతను నిన్న స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యం గ్రామ సమీపం పొలాల్లోని బావిలో ఈతకు వెళ్లగా బావిలో దూకిన నాని ఎంత సేపైనా పైకి రాక పోవడం తో మిగతా స్నేహితులు భయపడి అక్కడ నుండి వెళ్ళి పోయినట్టు,నాని తల్లిదండ్రులు నిన్న నుండి నాని కోసం వెతుకుచుండగా ఈ రోజు కొందరు స్థానికులు బావిదగ్గర ఈత  కోసం కొందరు పిల్లలు ఉన్నట్టు ఇచ్చిన  సమాచారం మేరకు బావి లో వెతకగా వినయ్ మృతదేహం బావిలో దొరికింది...దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.... బాలాయపల్లి పోలీసులకు సమాచారం అందించారు...బాలాయపల్లి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు...