ఘనంగా BSP పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షిరామ్ గారి 88 వ జయంతివేడుకలు.

  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట:-

 సూళ్లూరుపేట RTC బస్టాండ్ వద్ద నున్న డా:బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ (BSP ) సూళ్లూరుపేట నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యంలో  బహుజన పితామహులు , BSP పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షిరామ్ గారి 88 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BSP నియోజకవర్గ అధ్యక్షులు కైలాసం చెంగయ్య , నియోజకవర్గ ఉపాధ్యక్షులు  సత్యవేటి శ్రీనివాసులు , దొరవారిసత్రం మండల అధ్యక్షులు అంబూరు  క్షేత్రయ్య , సూళ్లూరుపేట ప్రధాన కార్యదర్శి యాసిన్ భాష , BSP సీనియర్ నాయకులు ఇంగిలాల ఆనంద్, మల్చి వీరయ్య, వలాం మునిరత్నం లు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి ముందుగా పూల మాల వేసి అనంతరం  మాన్యశ్రీ కాన్షిరాం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ బహుజనుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి మాన్యవార్ కాన్షిరామ్ అని  కొనియాడారు. ఈకార్యక్రమంలో సూళ్లూరుపేట, తడ మండలాల బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.