ప్రజలు అర్థం చేసుకుని కాస్త టైం ఇవ్వండి
ప్రజలు అర్థం చేసుకుని కాస్త టైం ఇవ్వండి
- వైసిపి హయాంలో సర్వం గాడితప్పిన పాలనను... ప్రజా ప్రభుత్వం టిడిపి వచ్చాక సరిచేస్తుంది
- అన్ని శాఖల్లో అప్పులు మిగిల్చిన ప్రభుత్వం వైసిపి
- దేశంలోనే రూ.4వేల నుండి రూ.15000 వరకు పెన్షన్ ఇస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే
- ఆగస్టు 15 న అన్నక్యాంటీన్లు పున:ప్రారంభం
- రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలి
- రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు తీయిస్తున్నారు
- గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు మురిగిపోయాయి
- ప్రజలు కట్టిన పన్నులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం వాడేసింది
- నెల్లూరు 48వ డివిజన్లో ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- 11 గంటలకు కార్పొరేషన్ లో భవన నిర్మాణాల దరఖాస్తులపై పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్
- గత వైసిపి ప్రభుత్వ అసమర్థ పాలనపై తనదైన స్టైల్ లో ఘాటైన విమర్శలు చేసిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలనను సరైన మార్గంలో పెట్టేందుకు టిడిపి ప్రభుత్వానికి ప్రజలు కాస్త టైం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ సమస్య ఉన్న తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. పెన్షన్ దారులను పేరుపేరునా పలకరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న 4000 రూపాయల పెన్షన్ను వృద్ధులకు, 6000 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు అందజేశారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలతో కలిసి 48వ డివిజన్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును మంత్రి నారాయణ అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ... తనదైన శైలిలో వైసిపి ప్రభుత్వ అసమర్థ పాలనపై ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పిన పరిపాలనను టిడిపి ప్రభుత్వం వచ్చాక సరిచేస్తున్నామని అయితే ప్రజలు ఇందుకు కాస్త టైం ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతగా పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే పెన్షన్ల పెంపు అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతినెల 1వ తేదీ తెల్లవారుజాము నుండే రాష్ట్రంలో 68 లక్షల 64 వేల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. వృద్ధులకు రూ.3వేల నుండి రూ.4 వేలు, దివ్యాంగులకు 3000 నుండి 6000 రూపాయలకు, అత్యధికంగా 15 వేల రూపాయల వరకు పెన్షన్ పెంచి ఇస్తున్నామని చెప్పారు. ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేయడమే కాదు అప్పులు చేసి పెట్టిందని ఘాటుగా విమర్శించారు. దీంతో ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయని... ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిన దౌర్భాగ్యపు పాలన గత ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరగాలని... పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ శాఖలోని ప్రజల కట్టిన పన్నులు డబ్బులన్నిటినీ గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు వాడేశారని మండిపడ్డారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మురిగిపోయాయన్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు మంత్రులను కేంద్రం నుంచి వచ్చే నిధులు కోసం పరుగులు పెట్టించేవారని తెలియజేశారు. ఆగస్టు మొదటి తారీకు నుండి రాష్ట్రంలో కనీసం 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఆగస్టు నెలాఖరుకు అంతా 203 అన్నా క్యాంటీన్లను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి కాస్త టైమ్ ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టి సమర్థవంతమైన ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నారాయణ ప్రశంసించారు.
11 గంటలకు భవన నిర్మాణాల పెండింగ్ ధరఖాస్తులపై మంత్రి స్పెషల్‌డ్రైవ్
నెల్లూరులో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు రాష్ట్ర పురపాలకశాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. ఇందుకోసం తేదీ 01-08-2024 గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ఇతర అధికారులతో పాటు తాను స్వయంగా పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ప్రాధానంగా పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తుదారులు విచ్చేసి స్పెషల్ డ్రైవ్ లో తమ దరఖాస్తులో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. అనంతరం జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజిజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు...
ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్..టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.