ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి 

కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,







నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్)

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్య తేజ సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక 33వ డివిజన్ నేతాజీ నగర్, వెంగళ్ రావు నగర్ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. చెత్త సేకరణ వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించి ఖాళీ స్థల యజమానులు వారి ప్రాంగణాలను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీ స్థలాలలో అవసరమైన జంగల్ క్లియరెన్స్ చేయించి, సమాంతరంగా మట్టిని చదునుచేసి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శికి షోకాజు నోటీసు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ పనులను డివిజన్ పరిధిలో వేగవంతం చేసి ప్రతి ఇంటినుంచి డ్రైనేజ్ కనెక్షన్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా

ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలి యోజన పథకంపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ సదుపాయం పొందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ ఉద్యోగుల గృహాలలో సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేసుకొని విద్యుత్ సదుపాయం పొంది, మిగిలిన వారందరికీ ఆదర్శంగా నిలవాలని, సూర్య బిజిలి యోజన పథకంతో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కమిషనర్ ఆకాంక్షించారు. తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులంతా సూర్య ఘర్ బిజిలి యోజన పథకాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఉద్యోగులందరికీ సర్కులర్ పంపించాలని కమిషనర్ ఆదేశించారు.ఎనర్జీ సెక్రటరీ ప్రతిరోజు ఉదయం తనిఖీలకు రావడం లేదు అని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వార్డ్ ఎనర్జీ సెక్రటరీస్ కి షో కాజ్ నోటీసులు జారీ చేయమని అధికారులకు ఆదేశించారు.అనంతరం స్థానిక వెంగళరావు నగర్ లోని అన్న క్యాంటీన్ కమిషనర్ సందర్శించి ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అన్న క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి నిర్వాహకులకు వివిధ సూచనలు కమిషనర్ జారీ చేశారు.అదేవిధంగా స్థానిక డివిజన్ పరిధిలోని అన్ని డ్రైనేజీ కాలువలలో పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులు నిరంతరం జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. వీధి దీపాల సమస్య లేకుండా ప్రతి విద్యుత్ స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ఎక్కువ వెలుగులు ఇచ్చే హై మాక్స్ లైట్లు అమర్చాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చేన్నుడు, రెవెన్యూ అధికారి ఇ నాయతుల్లా,ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు,స్థానిక నాయకులు హజరత్ నాయుడు, సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.