ఆమంచర్ల గ్రామంలో 35 లక్షలతో అభివృద్ధి పనులకు గిరిధర్ రెడ్డి శంకుస్థాపన




నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజల తమను మూడుసార్లు భారీ మెజారిటీతో ఆశీర్వదించారని వారి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు..

కూటమి ప్రభుత్వం ఓవైపు సంక్షేమం ,మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం రూరల్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 60 నుంచి 70 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు..

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేణు, జీవీఎన్  తో పాటు పలువురు పాల్గొన్నారు