చిట్టమూరు మండలం వల్లిపురంకు చెందిన ఆళ్ల భూపయ్య పూరిల్లు అగ్నికి ఆహుతయ్యింది. స్థానికుల కథనం మేరకు ఆళ్ల భూపయ్య కుటుంబ సభ్యులు సాయంత్రం దీపం వెలిగించి బయట ఊరికి వెళ్లారు. ఇంతలో 7:45 ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి, దట్టమైన పొగలు అలుముకున్నాయి .స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు తెలియజేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం మిద్దెఇల్లు  కావడంతో పెను ప్రమాదం తప్పింది .ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నట్లు కూడా స్థానికులు తెలియజేశారు .