దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్ 





* చెడు వ్యసనాలకు బానిసై చోరీల వైపు..

* పాత నేరస్థుడు ప్రసాద్ పై కాకినాడలో కేడి షీట్

* రూ.13.47 లక్షల సొత్తు స్వాధీనం 

* జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ వెల్లడి 


నెల్లూరు క్రైమ్ (మేజర్ న్యూస్)


చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా  తప్పించుకొని తిరుగుతున్న ముఠాను నెల్లూరు వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచిరూ.13,47,500 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కవాతు మైదానంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ దొంగతనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత ఎనిమిది నెలలుగా నెల్లూరు నగరం, రూరల్ పరిధిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక టీం తో దొంగలపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఈ క్రమంలో వేదాయపాలెం సిఐ శ్రీనివాస కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది స్థానిక గొలగమూడి రోడ్లో వాహనాలను తనిఖీ చేస్తున్న గా  పలువురిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగలుగా తేలడం జరిగిందన్నారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రసాద్ అలియాస్ ధర్మాది దుర్గాప్రసాద్ పాత నేరస్థుడు తో పాటు పసిల సత్యనారాయణ, నెల్లూరు రామ్ నగర్కు చెందిన కోట హరికృష్ణ, ఈస్ట్ గోదావరికి చెందిన కామాడి శ్రీనివాసులు, నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట రాంనగర్ కి చెందిన మర్లపాటి శ్రీహరి, శ్రీనివాస అగ్రహారంకు చెందిన భీమవరం లక్ష్మయ్య లను అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు. వారి వద్ద నుంచి 9 కేసులకు సంబంధించిన రూ.13,47,500 లక్షలు విలువ చేసే 372 గ్రాముల బంగారు ఆభరణాలు,400 గ్రాముల వెండి,2 మోటార్ సైకిళ్ళు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం పరుచుకున్నామన్నారు. 


చెడు వ్యసనాలతోనే చోరీలకు: 

చెడు వ్యసనాలతోనే ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. ప్రసాద్ అనే పాత నేరస్తుడిపై కాకినాడలో కేడి సీట్ కూడా నమోదు అయిందన్నారు. మిగిలిన దొంగలతో జైల్లో పరిచయాలు ఏర్పడి గత 8 నెలలుగా నెల్లూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. వీరందరి పై షీట్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. 


ప్రజలు అప్రమంతంగా ఉండాలి:


ఇళ్లకు తాళాలు వేసి బయట ఊర్లకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సూచించారు. తాళాలు వేసిన రోజున సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో తమ సిబ్బంది పగలు, రాత్రి గస్తీలను ముమ్మరం చేయడం జరుగుతుందన్నారు. మీ ప్రాంతంలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతుంటే తక్షణం పోలీస్ స్టేషన్ కి కాని , డైల్ 100కు కానీ సమాచారం అందించాలన్నారు. ఫలితంగా వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. 


సిబ్బందికి రివార్డులు: 


దొంగలను చాకచక్యంగా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం పరుచుకోవడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. విలేకరుల సమావేశంలో ఏ ఎస్ పి సౌజన్య, నగర డి.ఎస్.పి శ్రీనివాసులు రెడ్డి, సిఐలు కిషోర్ కుమార్, సుబ్బారావు, రోశయ్య, సుధాకర్ రెడ్డి, మద్ది శ్రీనివాసరావు, అన్వర్ భాష, సిబ్బంది పాల్గొన్నారు.