గండికోటకు సంస్కార భారతి పురస్కారం




నెల్లూరు [బుచ్చిరెడ్డిపాలెం] రవికిరణాలు ఏప్రిల్ 10 :  

విద్యార్థులకు కథలు, కవితలు, పద్యాలతోసంస్కారం,సహనం, పరోపకారం,దాతృత్వం, ధార్మిక జీవనం వంటి సద్గుణాలకు బాటలు వేస్తున్న బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సాహితీవేత్త గండికోట సుధీర్ కుమార్ కు సంస్కార భారతి పురస్కారం గురువారం అందజేశారు. ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా విజయవాడ సంస్కార భారతి, డాక్టర్ రామన్ ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం, విలువలు చిన్నప్పటినుండే పెంపొందిస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలు అందించినట్లు సంస్కార భారతి అధ్యక్ష,కార్యదర్శులు భాస్కర శర్మ, శ్రీనివాస్ తెలిపారు. సంస్కార భారతీ పురస్కారం అందుకున్న గండికోటను ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు అభినందించారు.