జి ఎస్ ఎల్ వి- ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం. షార్ నుంచి త్వరలో మానవ రహిత గగన్ యాన్ ప్రయోగం:- చైర్మన్ నారాయణన్.
జి ఎస్ ఎల్ వి- ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం. షార్ నుంచి త్వరలో మానవ రహిత గగన్ యాన్ ప్రయోగం:- చైర్మన్ నారాయణన్.
రవి కిరణాలు తిరుపతి జిల్లా శ్రీహరికోట (సూళ్లూరుపేట):-
భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి బుధవారం ప్రయోగించిన జి ఎస్ ఎల్ వి- ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్ వి ఎస్-02 ఉపగ్రహాన్ని
విజయవంతముగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిన అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్
మీడియా సమావేశం లో పాల్గొన్నారు, షార్ సెంటర్లోని మీడియా భవన్ లో ఇస్రో చైర్మన్
మాట్లాడుతూ ఇస్రో మూడు గగన్ యాన్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని అందులో రెండు మానవరహిత ప్రయోగాలు కాగా ఒకటి మాత్రం మానవ సహిత ప్రయోగం ఉంటుందని అన్నారు,షార్ నుండి జరిపిన వందవ రాకెట్ ప్రయోగం విజయవంతం దేశానికి గర్వకారణమని, భారత
చరిత్రలో బుధవారం జరిగిన 100 వ రాకెట్ ప్రయోగ విజయం చరిత్రాత్మకమైనది అన్నారు.
స్పేడెక్సు ప్రయోగం ద్వారా డాకింగ్ పరిశోధనను విజయవంతముగా నిర్వహించి ప్రపంచంలో
భారత్ ను ఇస్రో నాలుగోవ దేశముగా నిలిపింది ,1979 లో మొదటి ఎస్ ఎల్ వి- 3 రాకెట్ ప్రయోగ విజయం తో ఇస్రో విజయాల పరంపరను ప్రారంభించి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక
పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ రక రకాల రాకెట్లను రూపొందిస్తు వస్తుందని ఆయన తెలియజేసారు,ఈ సమావేశం లో షార్ డైరెక్టర్ రాజరాజన్ , వి ఎస్ ఎస్ సి డైరెక్టర్ ఉన్నికృష్ణన్, మిషన్ డైరెక్టర్ తామార్ కురియన్, ఎల్ పి ఎస్ సి డైరెక్టర్ మోహన్, యు ఆర్ ఎస్ సి డైరెక్టర్ శంకరన్, ఎస్ ఏ సి డైరెక్టర్ నీలేష్ దేశాయ్, స్పేస్ క్రాఫ్ట్ డైరెక్టర్
కార్తీక్ పాల్గొన్నారు.