తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రవి కిరణాలు 

 GSLV -F12 రాకెట్ ప్రయోగం విజయవంతం 

మరో 4 నావిగేషన్ ఉపగ్రహాల ప్రయోగం 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట నుండి ఈ రోజు  GSLV -F12 రాకెట్ ప్రయోగం

విజయవంతముగా ప్రయోగించింది,ఈ రాకెట్ ద్వారా NVS -01 నావిగేషన్ ఉపగ్రహాన్ని 18 

నిమిషాల 45 సెకండ్ల వ్యవధిలో నిర్దిష్ట కక్షలోకి చేర్చింది, ఈ సందర్భముగా మీడియా 

సెంటర్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో ఇస్రో చైర్మన్ సోమనాధ్ పాల్గొన్నారు, ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష కక్షలో ఉన్న IRNSS ఉపగ్రహాలను 

కాలంచెల్లి పోతున్న నేపథ్యం లో మరో నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను 6 నెలలు 

6 నెలలు వ్యవధిలో ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు,భారత భూభాగం నుండి 

1500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ నావిగేషన్ ఉపయోగపడుతుందని ,రోడ్ మార్గం,వాయు మార్గం, జల మార్గం లో కూడా GPS తరహాలో దారి చూపుతుందని ఆయన తెలియజేసారు,

ఈ సమావేశం లో మిషన్ డైరెక్టర్ గిరి,స్పేస్ క్రాఫ్ట్ డైరెక్టర్ KVS భాస్కర్,SAC  డైరెక్టర్ 

నీలేష్ N దేశాయ్ ,URSC డైరెక్టర్ శంకరన్,షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్,VSSC డైరెక్టర్ 

ఉన్నికృష్ణన్ నాయర్,LPSC డైరెక్టర్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.