29న నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్,
29న నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్,
షార్ లో పూర్తయిన రాకెట్ అనుసంధాన ప్రక్రియ.
రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట), శ్రీహరి కోట:-
అగ్రరాజ్యాలకు దీటుగా రాకెట్ ప్రయోగాలను చేపడుతూ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సన్నద్ధమవుతుంది .నావిగేషన్ వ్యవస్థను పటిష్ట పరిచే విధంగా రూపొందించిన 2232 కిలోల బరువు గల ఎన్ వి ఎస్-01 ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా నింగిలేకి ప్రవేశపెట్టనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించే విధంగా శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటివరకు ఏడు ఉపగ్రహాలను ప్రయోగించి నావిగేషన్ వ్యవస్థను పటిష్టపరిచింది. అయితే ఈ ఏడు ఉపగ్రహాలలో ఐఆర్ఎస్ఎస్-01 ఉపగ్రహం సేవలు నిలిచిపోవడంతో దాని స్థానంలో ఎన్ వి ఎస్ -01 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలు అందించేలా రూపొందించారు. ఈనెల 29వ తేదీన 10 గంటల 42 నిమిషాలకు ఈ రావికేట్ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జీఎస్ఎల్వీ ఎఫ్ - 2 రాకెట్ అనుసంధాన ప్రక్రియ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని అసెంబ్లీ సెంటర్లో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. రాకెట్ అగ్రభాగాన ఎన్ వి ఎస్-01 ఉపగ్రహాన్ని అమర్చి ఉష్ణ కవచం అమర్చారు. ఈ రాకెట్ లాంచ్ ప్యాడ్ వద్ద కు చేర్చి తుది పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం లాంచ్ ఆర్థరైజేషన్ బోర్డు ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాకెట్ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.