కేజీబీవీ ని తనిఖీ చేసిన జి సి డి ఓ మమత
కేజీబీవీ ని తనిఖీ చేసిన జి సి డి ఓ మమత
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం బాలిక శిశు అభివృద్ధి అధికారి టి.మమత ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోనిపరిసరాలను,వంటగది, స్టోర్ రూమ్,రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పంచతంత్ర కార్యక్రమాన్నిపరిశీలించారు.అనంతరం ఉపాధ్యాయినీలు,తో మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్లో,నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. అలాగే విద్యార్థినుల భద్రతా విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మమ్మ, అకౌంటెంట్ సరోజ, ఉపాధ్యాయుని లు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు