జీ ఓ నం. 77 వెంటనే రద్దు చెయ్యాలి- *ఎబివిపి డిమాండ్

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు కళ్ళకు నల్లగంతులు కట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించి ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ తిరుపతి జిల్లా కో కన్వీనర్ సన్నీ మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్య దీవెన పథకాలను నిలిపివేస్తున్నట్లు జారీ చేసిన జీవో నం.77 ను వెంటనే రద్దు చేయాలి. ఉన్నత చదువులు నిలిపే ప్రయత్నం చేస్తున్న జగనన్న, జీవో నం. 77 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 "మాట తప్పను - మడమ తిప్పను" అని పేద విద్యార్థులకు చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం అని, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు, వసతి, భోజనం కోసం అదనంగా 20,000 వేలు ప్రతి విద్యార్థికీ ఇస్తామని చెప్పి, మరి జీవో నం. 77 ను ఎలాగా ఉత్తర్వులు జారీ చేశారు అని ప్రశ్నిస్తు...

విద్యా దీవెన, వసతి దీవెన ఎటువంటి షరతులు లేకుండా విద్యార్థులందరికీ వెంటనే అమలు చెయ్యాలి అన్ని లేని పక్షము లో ఎలాంటి ఉద్యమనికి అయినా సిద్ధముగా ఉన్నాము అని వారు అన్నారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్, చందు, మహేష్, తోరాన్, రాకేష్, జేశ్వాంత్ తదితరులు పాల్గొన్నారు...