20 నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మూడు రోజులపాటు వైభవంగా కార్యక్రమాలు
20 నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మూడు రోజులపాటు వైభవంగా కార్యక్రమాలు
శ్రీనివాస కళ్యాణంకి రాజకీయాలకు సంబంధం లేదు
శ్రీనివాస కళ్యాణం ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెక్క సాయి సునీల్
నెల్లూరు నగరంలోని నిప్పో ఫ్యాక్టరీ లో శ్రీనివాస కళ్యాణంను ఈనెల 20వ తేదీ నుంచి మూడు రోజులు పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస కళ్యాణ ఆహ్వాన కమిటీ చెక్క సాయి సునీల్ తెలిపారు. నెల్లూరు నగరంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ గత ఆరు పర్యాయాలు అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణం మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈసారి ఏడవ సారి దీనిని మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు.
శ్రీనివాస కళ్యాణానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా సీనియర్ నేతగా ఉన్న తాటి వెంకటేశ్వర్లు గోవింద మాల వేసి ఉంటే ఆయనను అరెస్టు చేసి తీసుకువెళ్లారన్నారు. శ్రీనివాసుడి కృపతో ఈ ఏడాది తిరిగి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణం మహోత్సవానికి నిప్పో ఫ్యాక్టరీ ఆవరణను ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.