పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు యాజమాన్యం ఆదేశం మేరకు ఆర్టీసిలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఏపియస్ ఆర్టీసి కావలి డిపో మేనేజర్ కె.హరి తెలిపారు💐💐
ఈ నెల 27 నుండి మే 9 వరకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తమ హాల్ టికెట్టును చూపించి ఆర్టీసి బస్సులో రాకపోకలు సాగించవచ్చని ఆయన అన్నారు. అంతేకాక ఉచిత బస్సు పాసుల కాలపరిమితిని ఏప్రియల్ 30 నుండి మే 10వ తేది వరకు పొడిగించినట్లు డిపో మేనేజర్ తెలిపారు  ఉచిత బస్సుపాసు కలిగిన విద్యార్ధులు అదే బస్సుపాసుతో మే 10 వరకు ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్ధులు, ఉచిత బస్సుపాసు కలిగిన విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగితే 9959225643 , 08626 241444 , 7382926413 , 9493913989 నంబర్లకు ఫోన్ చేయిలని అన్నారు. పదవ తరగతి విద్యార్ధులు తమ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా డిపో మేనేజర్  కె.హరి శుభాకాంక్షలు తెలిపారు