ఎస్సీ నిరుద్యోగులకు ఉచిత కోర్సులు
నెల్లూరు, జనవరి09,(రవికిరణాలు) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపిఎస్‌ఎస్‌డిసి)ద్వారా"అన్ నఫియు ఎడ్యుకేషనల్ సొసైటీ" ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 12వ తేదీ నుంచి ఉచితంగా గ్రాఫిక్ డిజైనర్, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులకు శిక్షణా తరగతులు ఇవ్వనున్నట్లు సెంటర్ హెడ్ ఎస్.ఎమ్.బాబి పేర్కొన్నారు. గురువారం ఉదయం నగరంలోని " ప్రెస్ క్లబ్" నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నామని. ఈ సంవత్సరం ఏపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా గ్రాఫిక్ డిజైనర్ - ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులు అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే అవకాశం కల్పించినందుకు ఏపిఎస్‌ఎస్‌డిసి జిల్లా స్కిల్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్ ఖయ్యూమ్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కోర్సుల వల్ల ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు ఉపయోగపడుతాయి అన్నారు. కావున జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులు, విద్యార్థినీ, విద్యార్థులు పై అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరుచున్నామన్నారు. గత 4 సంవత్సరాల నుండి "అన్ సఫియు ఎడ్యుకేషనల్ సొసైటీ " నేతృత్వంలో " సాన్ టెక్నాలజీ " పేరుతో పలు కంప్యూటర్ కోర్సులు పేద విద్యార్థులకు సేవ చేయాలన్న మంచి ఉద్దేశంతో ఉచితంగా ఎమ్‌ఎస్-ఆఫీస్, ట్యాలీ, డిటిపి లాంటి కొన్ని కోర్సులను అందించామని ప్రస్తుతతం ఇంకా మరికొన్ని కోర్సులను కూడా అందించే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.ఆనంతరం ఎపి దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్త ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా లోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల కోసం అన్ నఫియు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యలంలో చేస్తున్న సేవలు అభినందనీయమని కావున జిల్లాలోని ఎస్సీ లుపై అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియచేశారు. కావున ఈ సమాచారాన్ని మీ పత్రిక లో ప్రచురించి పేద ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు విద్యార్థులకు తెలియచేసి వారికి సహాయ పడాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు.