కొండారెడ్డి దంత వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం. డెంటల్ ఎక్సరే పై 50 శాతం రాయితీ జర్నలిస్టులకు 50% రాయితీ డాక్టర్ దివ్య రెడ్డి వెల్లడి
కొండారెడ్డి దంత వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం. డెంటల్ ఎక్సరే పై 50 శాతం రాయితీ జర్నలిస్టులకు 50% రాయితీ డాక్టర్ దివ్య రెడ్డి వెల్లడి
నెల్లూరు, మేజర్ న్యూస్ : డాక్టర్ కొండారెడ్డి దంత వైద్యశాలలో 54వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, డెంటల్ ఎక్సరే పై 50% రాయితీ , అన్ని రకముల దంత చికిత్సలపై 20% డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు డాక్టర్ జి. దివ్య రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ దివ్యరెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్రముఖ దంత వైద్యశాల అయినటువంటి డాక్టర్ కొండారెడ్డి దంత వైద్యశాల ఏర్పడి 54 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో ప్రారంభించబడిన డాక్టర్ కొండారెడ్డి డెంటల్ స్టూడియోలో ఉచిత కన్సల్టేషన్ ను డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టులకు 50% రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ కొండారెడ్డి డెంటల్ స్టూడియోలో అన్ని రకములైన అత్యాధునిక దంత వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటు ధరలకే అందిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ జి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.