వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి క్రాస్ ఓటింగ్ వేసేందుకు కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు పార్టీ భావిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.