60 లక్షల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 17 మరియు 18 డివిజన్ పరిధిలోని అపోలో హాస్పిటల్ సెంటర్ టు పెద్ద బైపాస్ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
 వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డు పనులను పూర్తిచేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  ఈ రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాలు పోకుండా రోడ్డు మొదట, చివరన ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.   ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి సహాయసహకారాలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నింటిని పూర్తిచేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ శ్రీమతి హరిత గారు, 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు, 17, 18 డివిజన్ల స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.