నెల్లూరు డైకస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ఈనాడు పత్రికకు సోమిరెడ్డి పేపర్ బాయ్" - కాకాణి
నెల్లూరు డైకస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
కాకాణి మాట్లాడుతూ..
జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ప్రతిదానికి జవాబు ఇచ్చాం.
నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక పత్రికలలో వ్యక్తిగతంగా రాస్తున్నారు.
సోమిరెడ్డి ఈనాడు పత్రికకు "పేపర్ బాయ్" అవతారం ఎత్తాడు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, అక్రమ లేఔట్లను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది.
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించారు.
సోమిరెడ్డి అనుచరుడు పొదలకూరు పోలేరమ్మ మాన్యాన్ని ఆక్రమిస్తే స్థానికులు అడ్డుకొని, ఆక్రమణలు తొలగించారు.
2019లో బిజెపికి సంబంధించిన వ్యక్తి ఇచ్చిన అర్జీ మీద జిల్లా కలెక్టర్ గారు అక్రమ లేఔట్లపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
తెలుగుదేశం పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టిన సమయంలో 40 అక్రమ లేఔట్లు గుర్తించామని అధికారులు కలెక్టర్ గారికి నివేదికలు అందజేశారు.
25 లేఔట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా జరగలేదని గుర్తించారు.
విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి 6 కోట్ల 52 లక్షల 36వేల 405 రూపాయలు అక్రమ లేఔట్ల యాజమాన్యాల నుండి వసూలు చేయమని మెమో జారీ చేశారు.
అక్రమ లేఔట్ల యాజమాన్యాల నుండి 2 కోట్ల రూపాయలు ముడుపులు దండుకొని, సోమిరెడ్డి పంచాయతీ కార్యదర్శులను బెదిరించి, పెనాల్టీ వసూలు చేయకుండా అడ్డుకున్నాడు.
సోమిరెడ్డి ధన దాహానికి పంచాయతీ కార్యదర్శులు బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అక్రమ లేఔట్లు వేసి సంపాదించుకున్న యాజమాన్యాలు, దండుకున్న సోమిరెడ్డిని విడిచి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని ఆనాడు కలెక్టర్ గారికి నివేదించాం.
సోమిరెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా...!
ఈరోజు సోమిరెడ్డి ఈనాడు పేపర్ బాయ్ అవతారం ఎత్తి, మంత్రి ఊరు.., మంత్రి ఇలాకా అంటూ రాయిస్తున్నాడు.
సోమిరెడ్డీ.., నీ అల్లీపురం ఇంటి చుట్టూ ఉన్న అక్రమ లేఔట్లకు ఎంత ముడుపులు తీసుకొని మిన్నకుండిపోయావు.
సోమిరెడ్డీ.. దమ్ముంటే, నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమ లేఔట్ల పై విచారణ జరిపించు...
ఈనాడు పేపర్ అధినేత చెరుకూరి కిరణ్ (తండ్రి రామోజీరావు) గారికి బహిరంగ లేఖ రాస్తున్నా..
పొదలకూరులో డబ్బులు దండుకొని, అనుమతులు ఇచ్చే సంప్రదాయం సోమిరెడ్డిదని విచారించి, రాయగలవా!.
కృష్ణాపట్నం ఏపీ జెన్కో నుండి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రతినిత్యం బల్కర్లతో ఫ్లై యాష్ తరలిస్తూ, సోమిరెడ్డి బల్కర్ కు నెలకు లక్ష రూపాయల చొప్పున సొమ్ము చేసుకుంటున్నాడు.
నుడా అనుమతులున్న లేఔట్ యాజమాన్యాలను బెదిరిస్తూ, అక్రమంగా కోట్లాది రూపాయలు సోమిరెడ్డి వసూలు చేస్తున్నాడు.
"సర్వేపల్లికే నా జీవితం అంకితం" అన్న సోమిరెడ్డి, లేఔట్ యాజమాన్యాలకు "సర్వేపల్లి మొత్తం రాసిస్తా.. నాకు ఎంత ఇస్తారన్న" చందంగా, చందాలు దండుకుంటున్నాడు.
సోమిరెడ్డి సర్వేపల్లిలోని కంపెనీ యాజమాన్యాలను బెదిరించి, ఎన్నికల ఖర్చు అయ్యిందంటూ, సొమ్ములు జమ చేసుకుంటున్న మాట వాస్తవం కాదా...!
సోమిరెడ్డి పై చంద్రబాబు నిఘా పెడితే నెల రోజుల కాల వ్యవధిలోనే కోట్లాది రూపాయల వసూళ్ల బాగోతం బయటపడుతుంది.
సోమిరెడ్డి సర్వేపల్లిలోని కంపెనీలను, పోర్టు యాజమాన్యాలను ముడుపుల కోసం బెదిరిస్తున్నాడు.
చంద్రబాబు సోమిరెడ్డి లాంటి అవినీతిపరుడ్ని, సర్వేపల్లిలో సోమిరెడ్డి చేస్తున్న దోపిడీని అడ్డుకోగలడా.., నిరోధించగలడా..!
అధికార పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసినా సర్వేపల్లిలోని లేఔట్ల యజమాన్యలను ఎక్కడైనా బెదిరించానని నిరూపించగలరా!
సోమిరెడ్డి పై నేను చేసిన ఆరోపణలకు సంబంధించి, విచారణ జరిపే ధైర్యం చంద్రబాబుకు ఉందా.. వాస్తవాలు అని తేలితే రాసే దమ్ము ఈనాడు రామోజీరావు తనయుడు కిరణ్ కు ఉందా!