రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిని సన్మానించిన మాజీ మంత్రి సోమిరెడ్డి.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిని సన్మానించిన మాజీ మంత్రి సోమిరెడ్డి.
పొదలకూరు మేజర్ న్యూస్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా 2024 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన జిల్లా నుండి ఎంపికైన పొదలకూరు బాలుర ఉన్నత పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు ఏ.వి సుధాకర్ ను మాజీ మంత్రివర్యులు ,సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సన్మానించారు.విజ్ఞాన కార్యక్రమాల విజయాలలో సుధాకర్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. సుధాకర్ జాతీయస్థాయి అవార్డు కూడా త్వరలో అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బోగోలు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.