ఆంధ్రప్రదేశ్‌ను నవ్వులపాలు చేశారు - మాజీ మంత్రి సోమిరెడ్డి
అమరావతి,జనవరి 7, (రవికిరణాలు) : మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ
వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గన్ మెన్లు ముందుగా రైతులపై దౌర్జన్యం చేశారు. రైతులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు.రామకృష్ణా రెడ్డి అక్కడకు ఎందుకెళ్లారు..? అంతకుముందు ఆదిమూలపు సురేష్ వస్తే రైతులంతా బతిమాలితే వెనక్కి వెళ్లారు. రైతులను కొట్టి మళ్లీ రైతులపైనే కేసులు బనాయిస్తారా..? రాష్ట్రంలో రాజధాని సమస్య సృష్టించింది వైసిపినే..151సీట్లు ఇచ్చి పాలించమంటే, అదిచేతగాక, ఉన్నదాన్ని చెడగొట్టింది వైసిపినే..5 రోజుల్లో బోస్టన్ కమిటి 3రాజధానులు చేయమని రిపోర్ట్ ఇస్తుందా..? 7నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ను నవ్వులపాలు చేశారు.టిడిపి ప్రభుత్వం 5ఏళ్లలో రాష్ట్రానికి ఎన్నో అవార్డులు తెచ్చింది. అలాంటిది వీళ్లు ఈ విధంగా నవ్వులపాలు చేశారు.జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాజధానిని మార్చలేరు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అన్ని జిల్లాలు పోరాడతాయి, అన్నివర్గాల ప్రజలు పోరాటం చేస్తారు.హైదరాబాద్ లో సెక్రటేరియట్ ను ప్లేస్ మార్చడానికే హైకోర్ట్ అంగీకరించలేదు. రూ.400కోట్లతో నిర్మిస్తామని కెసిఆర్ డిజైన్లు చూపించినా ఒప్పుకోలేదు. చెస్ట్ హాస్పిటల్ సైట్ చూశారు , ఎర్రగడ్డలో 60ఎకరాలు అన్నారు, బైసన్ గ్రవుండ్స్ అన్నారు. దేనికీ అంగీకరించలేదు. పాతభవనాలు కూలగొట్టి కొత్తవి కడ్తామంటే ఒప్పుకోలేదు, ఒకవైపు అప్పులు చేస్తూ మరోవైపు దుబారా ఖర్చులేంటని ప్రశ్నించింది. అలాంటిది గెజిట్ విడుదలచేసి, 4ఏళ్లుగా అమరావతిలో సక్రమంగా అన్నీ నడుస్తోంటే, దానిని ఇప్పుడు మరోచోటకు తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు..న్యాయస్థానాలు ఉన్నాయి..3 కోర్టులు, 3రాజధానులు అంటావు నీకేమైంది జగన్మోహన్ రెడ్డీ..13 జిల్లాలకు 3 హైకోర్టులు పెడ్తావా..? 4 జిల్లాలకు ఒక కోర్టు పెడతావా..? దేశంలో 732 జిల్లాలకు 25 హైకోర్టులు 15 బెంచ్ లు ఉన్నాయి. సగటున 19 జిల్లాలకు ఒక హైకోర్టు, బెంచ్ ఉంది. నీలా ఆలోచిస్తే దేశంలో 175 హైకోర్టులు
పెట్టాలి. 8 రాష్ట్రాల్లో బెంచ్ లు పెట్టడానికే ఒప్పుకోలేదు. హైకోర్టు కర్నూలుకు నువ్వు తెచ్చేదిలేదు..చచ్చేదిలేదనే అక్కడి ప్రజలు గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు. అమరావతిలో భారత ప్రభుత్వ సంస్థలు 25 సంస్థలకు 192ఎకరాలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు 24కు 165 ఎకరాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వ పిఎస్ యూలు 18 యూనిట్లకు 23ఎకరాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పిఎస్ యూలు 4 యూనిట్లకు 11.27ఎకరాలు ఇచ్చాం. ఆలిండియా సర్వీసెస్ అధికారులు 372మందికి 38.43ఎకరాలు ఇచ్చాం. 16మంది జడ్జిలు, రిజిస్ట్రార్లకు 2ఎకరాలు ఇచ్చాం. 130పైగా సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించాం.
వీటన్నింటినీ ఏట్లో కలిపేస్తారా..? నాబార్డు, ఆర్బీఐ, ఎస్.బీ.ఐ, ఎయిమ్స్ అన్నీ ఎత్తేస్తారా..? మొత్తం పూడ్చేస్తారా..?రాజధాని మార్పుపై కారణం ఇది అని చెప్పడానికి ఒక్క అంశం లేదు వీళ్లదగ్గర..దమ్ముంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ పై యాక్షన్ తీసుకోండి.. మీ బోస్టన్ గ్రూప్, జిఎన్ రావు ఏం స్టడీ చేశారో గాని, ఒక్క సామాన్యుడు కూడా చెప్పగలడు నీవల్ల కాదు వీటిని తరలించడం అని..? 85% అసెంబ్లీ అంతా మిమ్మల్ని కూర్చోబెడితే, 15% టిడిపికి ఇస్తే, మాపై కక్ష కట్టడం ఏంటి..? ప్రజలపై కక్ష సాధించడం ఏంటి..?జగన్ కు సలహాలు ఇచ్చే దమ్ము కూడా వైసిపి మంత్రులకు లేదా..? మీ నిర్వాకాల వల్ల గ్రోత్ రేట్ పడిపోయింది.చెక్ డ్యామ్, మరుగుదొడ్డి నుంచి పోలవరం దాకా, అమరావతి దాకా పండబెట్టారు. పనులు లేవు, పండగలు లేవు..రేపు సంక్రాంతి కూడా చేసుకునే పరిస్థితి లేదు.ఏదో వడి, మరేదో బడి అని ఏడాదికి రూ.10వేలు ఇస్తా, ఇంట్లో
పడుకోండని చెప్పి, వాళ్లకు పనులు లేకుండా చేస్తే ఏం తినాలి, ఏం పొదుపు చేయాలి..?టిడిపి పాలనలో రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో, ఎన్ని అవార్డులు వచ్చాయో అదంతా పోగొట్టారు.