అన్నం పెట్టే రైతన్న - బట్టలు ఇచ్చే నేతన్న బాధలు వర్ణానాతీతం
December 09, 2020
Former ZPTC member Venkateswara Reddy visited Gummalladibba BC Colony under Kovur Panchayat to inspect the loom pits submerged due to heavy rains and recent storms during the last month.
మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్ళదిబ్బ బి.సి కాలనీ లో పర్యటించి గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన,ఇటీవల వచ్చిన తుపానుల వలన నీట మునిగిన మగ్గం గుంతలను పరిశీలించి చేనేత కార్మికులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
కరోనా విపత్తు నుండి కొలుకొనక మునుపే భారీ వర్షాలు, తుపానులు చేనేతల జీవితాలను అతలాకుతలం చేశాయి.గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వలన మగ్గం గుంతలలో నీరు చేరడము వలన నేతన్నల తీవ్రంగా నష్టపోయారు
ఇటీవల కురిసిన వర్షాలు, ఇటీవల వచ్చిన తుపానుల వలన అన్నం పెట్టే రైతన్న, బట్టలు ఇచ్చే నేతన్నలు పడుతున్న బాధలు వర్ణానాతీతం
వర్షాల వలన మగ్గం గుంతలలోకి నీరు రావడము వలన పడుగు,జారీ,పట్టు తడిచి పోవడమే కాకుండా నేచిన చీరలు కూడా తడిచి పాడై పోయాయి.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వీరికి కనీస సహాయం కూడా చేయలేదు
గతములో 2015 వ సంవత్సరం లో వరదలు వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నెల్లూరు జిల్లాకు వచ్చి మూడు రోజులు ఉండి అందరిని పరామర్శించి బాధితుల అందరికి తక్షణ సహాయం చేసి ఆదుకోవడం జరిగింది.నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చి భాదితులను పరమర్శించకుండా గాలిలో తిరిగి పోయి బాధితులను గాలికొదిలేశారు.
2015 వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.11,500 నగదు,50 కేజీ ల బియ్యం,నిత్యావసర వస్తువులను ఇచ్చి ఆదుకోగా నేటి వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు
నాటి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వరద సాయం ఏమూలకు రాదని,ఇంకా ఎక్కువ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేడు ముఖ్యమంత్రి అయిన తరువాత చేనేత కార్మికులకు తెలుగుదేశం ప్రభ్యత్వం చేసిన సహాయం కూడా చేయలేదు.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నాడు
ఈ సందర్భంగా వర్షాలు,తుపానుల వలన గత నెల రోజులుగా పస్తులుంటున్న చేనేత కార్మికులకు తక్షణ సాయం క్రింద ప్రతి మగ్గానికి రూ.20 వేల ఆర్ధిక సహాయం,50 కేజీ ల బియ్యం,నిత్యావసర సరుకులు ఇవ్వాలని, అదేవిధంగా చేనేత అనుబంధ వృత్తులలో పని చేసే వారికి కూడా ఆర్థిక సహాయం, బియ్యం,నిత్యావసర వస్తువుల ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి,జొన్నదుల రవికుమార్,పొలిశెట్టి వెంకటేశ్వర్లు, నాపా ప్రదీప్,ఉక్కిం మల్లికార్జున,కావాలి ఓంకార్,Sk నాసీర్,మహ్మద్, సోమవరపు సుబ్బారెడ్డి, సజ్జా అశోక్,గోపాల్,రవి,గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు