రాకెట్ ప్రయోగ విజయం కోసం
ఇస్రో చైర్మన్ చెంగాళమ్మ కు పూజలు.
 
సూళ్లూరుపేట రవి కిరణాలు మార్చి 25:-

 సూళ్లూరుపేట పట్టణంలో కాళ్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి తల్లిని శనివారం ఇస్రో చైర్మన్ సోమనాధ్ అమ్మణ్ణిని దర్శించుకొని పూజలు చేశారు.

 శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి నేడు  ఉదయం జరిగే ఎల్ వి ఎం 3 - ఎం 3  రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ అమ్మణ్ణినికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవా అయితే ప్రకారం శనివారం అమ్మవారికి పూజలు చేశారు.

 ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి ఇస్రో చైర్మన్ కి స్వాగతం పలికి దర్శనం అనంతరం ఆలయ మర్యాదలు అందజేశారు.

ఈ సందర్భముగా ఇస్రో చైర్మన్ సోమనాధ్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం జరిగే ఎల్.వి.ఎం 3 - ఎం 3
రాకెట్ పూర్తిగా వాణిజ్జ పరమైన ప్రయోగమని దీనికి సంబంధించి శనివారం ఉదయం 8.30 గంటలకి కౌంట్ డౌన్ మొదలు పెట్టినట్లు ఈ ప్రయోగ విజయానికి చెంగాళమ్మ ఆశీస్సులు కోసం వచ్చినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల (ఏప్రిల్) చివరి వారం లో మరో పి ఎస్ ఎల్ వి రాకెట్ ప్రయోగం ఉంటుందని ఇది
కూడా వాణిజ్య పరమైన ప్రయోగమని ఇది సింగపూరు కు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపారు.చంద్రయాన్ 3 ప్రయోగానికికూడా సన్నాహాలు సిద్ధం
చేస్తున్నట్లు అలాగే జూన్ లో ఆదిత్య ఎల్ -1 ప్రయోగం ఉంటుందని కూడా ఆయన
తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి,వంకా దినేష్ ,మన్నెముద్దు పద్మజ ,బండి సునీత ,నాయుడుకుప్పం నాగమణి
తదితరులు పాల్గొన్నారు.