వాణిజ్య పంటలపై దృష్టి సారించండి

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో రైతన్నలకి పిలుపునిచ్చిన ఎంపీ గురుమూర్తి


ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖలైన హార్టీ కల్చర్, సెరీ కల్చర్, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారులు పాల్గొని ఆయా శాఖల పరంగా అమలు పరుస్తున్న వివిధ పథకాలు వాటి గణాంకాలను వివరించారు.

ఈ సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ సాగునీటికి సంబందించిన, ధాన్యం సేకరణ, ఈ క్రాపింగ్ కి సంబందించిన పలు సమస్యలను ప్రస్థావించారు.

అనంతరం సూళ్లూరుపేట ఏమైల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ దాన్యం సేకరణలో దళారుల జ్యోక్యాన్ని అరికట్టాల్సిందేనని తద్వారా రైతులలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి వారికి ప్రభుత్వ మద్దతు ధరపై ఒక భరోసా కల్పించాలని  కోరారు.

తదుపరి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటల నుండి వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని తద్వారా ఆదాయ మార్గాలను మెరుగు పరచుకోవచ్చని చెప్పారు. ఆలాగే సాగు చేసే ప్రతి ఎకరా కూడా తప్పకుండ ఈ క్రాపింగ్ చేయాలని, సీజన్ మొదలు అయ్యే ముందరే సివిల్ సప్లయస్, మార్క్ ఫెడ్ వాళ్ళు సమన్వయంతో ప్రభుత్వం గుర్తించిన విత్తన రకాలను రైతులకి తెలియజేయాలని కోరారు.ప్రభుత్వ సబ్సిడీ ఎక్కువ ఉన్నందున రైతులు సెరీకల్చర్ మీద కూడా దృష్టి సారించే విధంగా అధికారులు రైతులకి అవగాహన కల్పించాలని చెప్పారు..

కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమావేశం ఫలవంతంగా జరిగిందని శాసనసభ్యులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు చక్కని సలహాలు ఇచ్చారని ఆలాగే సభ్యులు ప్రస్థావించిన సమస్యలు అన్ని పరిష్కారం దిశగా చర్యలు తీసుకొంటామని తెలియజేసారు.

ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట ఏమైల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఏమైల్యే ఆదిమూలం, తిరుపతి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి, కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, మరియు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.