రాజధాని అమరావతిలో 300 రోజులకు పైగా రైతులు నిరాహార దీక్ష చేస్తా వుంటే, కనీసం స్పందించని ప్రభుత్వం, మూడు రాజధానుల పేరుమీద రైతులు చేపట్టిన ర్యాలీని భగ్నం చెయ్యటం, రైతులపై తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, రైతులకు బేడీలు వెయ్యడం దుర్మార్గమైన చర్య. రైతులు ఏమి తప్పు చేశారని చెప్పి చేతులకు బేడీలు వేస్తారు? 33 వేల ఎకరాలు రాజధానికి ఇవ్వటం రైతులు చేసిన తప్పా?

 ఒకపక్క మూడు రాజధానులు పేరిట డ్రామాలు ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వం, రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు నిరాహారదీక్ష చేస్తా వుంటే, అక్కడికి కిరాయి మనుషులను పంపించి  రైతుల మీద దాడి చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య.

 ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు అనేకమార్లు పాదాభివందనం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా మేము కూడా సపోర్ట్ చేస్తాం, రాజధానికి భూములు ఇవ్వడం మంచి నిర్ణయం అని చెప్పి మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల తర్వాత మాట మార్చి రైతుల కాళ్లు విరగ్గొట్టాలని చూడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా ఖండిస్తా ఉంది.

 ఎస్సీ రైతులపై ఎస్సీ యాక్ట్ పెట్టడం పిచ్చి తుగ్లక్ చర్య. రాజధానికి కులం అంటగట్టారు. ఈ రోజు కులాల ప్రస్తావన లేకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రోజు ఆందోళనలో పాల్గొని రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రైతుల చేతులకు బేడీలు వేసి నందుకు భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి. రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ప్రకటన చెయ్యాలి.