రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లా,టి.పి.గూడూరు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రైతుల సంక్షేమం గురించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.పుష్కలంగా సాగునీరు ఉండటం, రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున పంటలు సాగుచేసిన పరిస్థితి.జిల్లాలో 20 లక్షల టన్నుల ధాన్యం వస్తుండగా, సర్వేపల్లి నియోజకవర్గములోనే 5 నుంచి 6 లక్షల టన్నులు వస్తుందని అంచనా ఉంది.ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీపడకుండా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధర కల్పిస్తున్న రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.గత ప్రభుత్వంలో కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని సరిగా నడపలేక రైతులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూశాము.ఏ పరిస్థితులలోను ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది.అందుకే గతంలో15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటే, ప్రస్తుతం వాటిని 28 కి పెంచి రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది.
గతంలో తేమశాతం పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన పరిస్థితి.గతంలో కొన్ని చోట్ల దళారులు ధాన్యం తీసుకొని రైతులకు నగదు ఇవ్వని పరిస్థితులు.ఆవిధంగా కాకుండా తేమశాతంలో గానీ, బస్తాల పంపిణీ లో గానీ ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.రైతుభరోసా కింద నగదు పడని వారికి, సమస్యలు సరిచేస్తున్నాం, త్వరలోనే వారి ఖాతాల్లో జమవుతుంది.కొందరు మాత్రం కొనుగోలు మొదలు కాకముందే ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు!.అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం,
అలసత్వం వహించకుండా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.గతంలో రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసింది మహానేత రాజశేఖర్ రెడ్డి అయితే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.