తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జితేంద్ర కుమార్ సోనీ వారి మిత్రులకు 7 వేల చొప్పున 21వేలకు మూడు నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయించారు. దళారులతో కుమ్మక్కయిన ఎస్.పి.ఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు ఈ చర్యకు పాల్పడ్డారు.

 తిరుమల లడ్డు కౌంటర్‌లో పనిచేసే అరుణ్ రాజు, తిరుపతి ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే అతని స్నేహితుడు బాలాజీతో పరిచయం చేసుకుని నకిలీ 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నారు ఎస్‌పి‌ఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు. ప్రత్యేక దర్శనం కౌంటరు ఉద్యోగి నరేంద్ర కృష్ణారావుకు సహకరిస్తున్నారు.

 నరేంద్ర సహాయంతో నకిలీ టికెట్లను స్కానింగ్ చేయకుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. నకిలీ టికెట్ల వ్యవహారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన మరో భక్త బృందానికి కూడా 3300 చొప్పున నాలుగు ప్రత్యేక దర్శనం టికెట్లను అమ్మింది ఈ ముఠా.