విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఎగ్జిబిషన్లు..
జెసి చంద్రమౌళి
పూర్వపాఠశాల విద్యార్థిగా రావడం ఆనందం..
పలమనేరు, జనవరి22,(రవికిరణాలు) : విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక, ఆలోచనలు వెలికితీసేందుకే ఎక్సిబిషన్లను ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్సఇర్ మనక్ అవార్డ్స్..2020ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలోనూ జేసీ మాట్లాడుతూ విద్యార్థులు విధ్యలోనే గాకుండా విజ్ఞానంతో నిజజీవితంలో చూస్తున్న విషయాన్ని స్వయంగా చేయడానికి సైన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఇలా చూస్తున్న విషయం తెలుసుకునేందుకు ప్రయోగాలు ద్వారా మరింత మేధోశక్తికి తోడ్పడుతూందన్నారు.తెలివితేటలు పెంపొందించుకొని అందరూ విజ్ఞాన వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇదే పాఠశాల నుంచి తాను 1970..71 సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్తిగా చదివి,మీలాగే సైన్స్ ప్రయోగాలు చేయడానికి మదనపల్లె కు వెళ్లినట్లు ఆయన జ్ఞాపకాలను విద్యార్థుల నడుమ ఆనందంగా పంచుకున్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తులో ప్రతి విద్యార్థి డాక్టర్ అబ్దుల్ కలామ్ వంటి శ్రాస్రవేతలుగా తయారు చేయడం కోసం ఇటువంటి ప్రయోగ ప్రదర్శనలు ప్రభుత్వం నిర్వహించిందన్నారు.జేసీ,జిల్లా విద్యా శాఖ అధికారి,జిల్లా సైన్స్ అధికారి రమణ,డి వై ఇ ఓ పురుషోత్తం,మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మిణమ్మలు కలసి విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను ఆసక్తిగా విని తిలకించారు.కాగా జిల్లా లోని 300 పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.కార్యక్రమంలో గైడ్ టీచర్లు,పరిసర ప్రాంతాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలను తిలకించారు.మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.