రవి కిరణాలు ప్రతినిధి

 ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

 కోట మండలం కేశవరం పంచాయతీ  ఐదవ వార్డు  ఉప ఎన్నికకు  సర్వం సిద్ధం చేసినట్టు  డిఎల్పిఓ వెంకటరమణ పేర్కొన్నారు.  ఇటీవల ఐదో వార్డ్ అభ్యర్థి  ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఐదవ వార్డుకు  ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 14వ తేదీ ఉపసంహరణ అనంతరము   ఉల్లిపాయల పుల్లమ్మ, కొడవలూరు రేవతి   బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికకు 19వ శనివారం తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటిగంట వరకు  పోలింగ్ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.  అనంతరం రెండు గంటలకు  కౌంటింగ్ జరుగుతుందని, గెలిచిన అభ్యర్థికి  ఎన్నిక పత్రాన్ని కూడా   ఇవ్వనున్నట్లు   పేర్కొన్నారు

 ఐదవ వార్డులో 208 ఓట్లకు గాను పురుషులు 106 మంది,  స్త్రీలు 102 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో  ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని  పేర్కొన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని  సూచించారు.  ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నిక నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో  ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మస్తానయ్య, పోలింగ్ ఆఫీసర్ మధుసూదన్ రావు, ఎండిఓ భవాని, కోట మండలం ఈ ఓ పి ఆర్ డి శ్రీనివాసులు,పోలింగ్