ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకోవాలి... స్వీప్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకోవాలి... స్వీప్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి విలువనివ్వాలి : జెసి ధ్యానచంద్ర
రవి కిరణాలు,తిరుపతి, మార్చి18 :-
జిల్లాలో
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రతి ఒకరికి అవగాహన కల్పించేలా నేడు తిరుపతి పట్టణంలో నిర్వహించిన స్వీప్ అవగాహనా కార్యక్రమ ర్యాలీని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి లక్ష్మి శ, జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్.ఎం ధ్యాన చంద్ర , నగర పాలక కమిషనర్ అదితి సింగ్ జిల్లా అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా ముఖ్యంగా స్వీప్ యాక్టివిటీ (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్) ఓటరుకు అవగాహన పెంచి ఓటు వేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు వారి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని అన్నారు. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండుగ అని, ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనాలని తెలిపారు. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పించేలా స్వీప్ కార్యక్రమాలను తిరుపతిలో చేపట్టడం జరిగిందని అన్నారు ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా స్వీప్ యాక్టివిటీని అధికారులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని అన్నారు. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లోగో " ఎన్నికల పర్వం దేశం యొక్క గర్వం" అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సదుపాయాలు ఎలక్షన్ కమిషన్ కల్పించిందని, వికలాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సదుపాయాలను కల్పించిందని అన్నారు. ఆన్లైన్ ద్వారా వారి పోలింగ్ బూత్ లను తెలుసుకునే సదుపాయం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు.ఈ సదుపాయాలను మరియు ఓటర్లను ఉత్తేజపరచడానికి స్వీప్ యాక్టివిటిని చేపట్టడం జరిగిందని మీడియా మిత్రులు అందరూ సహకరించి ప్రజలకి ఈ యొక్క సమాచారం అందేలా చూడాలని తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటర్ కు అవగాహన కల్పించేలా స్వీప్ యాక్టివిటీని అధికారులందరం కలిసి చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆక్టివిటీ ద్వారా పలు రకాల ర్యాలీలు చేపట్టి ప్రతి ఒక్కరిలో ఓటింగ్ పై అవగాహన కల్పించాలని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి విలువని ఇవ్వాలని అన్నారు.
ఈ ర్యాలీ తిరుపతి లోని ఎస్.వి యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.
ఏ ర్యాలీలో స్వీప్ నోడల్ అధికారి మురళీ కృష్ణ, జిల్లా అధికారులు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.