ప్రతిఒక్కరికి పని కల్పించాలి.



ఉదయగిరిమేజర్ న్యూస్.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతిఒక్కరికి పని కల్పించాలని ఎంపీడీవో దేవరకొండ ఈశ్వరమ్మ, ఏపీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం లో ప్రతిరోజు 5 వేల మందికి పని కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రతి పంచాయతీలో ఉపాధి పనులు ప్రారంభిం చాలన్నారు. హార్డికల్చర్ పథకంలో భాగంగా రైతులకు అవగానహన కల్పించి పండ్లతోటలు విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. మండలంలో పెండింగ్ లో ఉన్న పక్కాగృహాల బేస్మెంట్ లెవల్ బిల్లుల ప్రతిపాదనలను పంపాలన్నారు. ఈ కార్య క్రమంలో ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు