ప్రతి చిన్నారి బడిలో ఉండాల్సిందే అవకాశాలను సద్వినియోగం చేసుకుని బంగారు భవిత పొందాలి
ప్రతి చిన్నారి బడిలో ఉండాల్సిందే
అవకాశాలను సద్వినియోగం చేసుకుని బంగారు భవిత పొందాలి
డీఎన్ఆర్ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి బాధ్యత నాది
ఆర్వో ప్లాంటును యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తేవడంతో పాటు డైనింగ్ హాలు నిర్మాణానికి హామీ
పొదలకూరులోని డీఎన్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎమ్మెల్యేగా మొదటిసారి తమ స్కూలుకు వచ్చిన సోమిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నారులు
మొదట డీఈఓ రామారావు, హెచ్ఎం, ఉపాధ్యాయులతో సమావేశమై సమస్యలపై చర్చించిన సోమిరెడ్డి
730 మంది విద్యార్థినులు చదువుతున్న ఈ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
విద్యార్థులకు క్రీడామైదానం ఏర్పాటుతో పాటు సమీపంలోని వసతి గృహాన్ని అందుబాటులోకి తేవడంపై చర్చ
సోమిరెడ్డి కామెంట్స్
విద్యారంగం కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చుపెడుతోంది.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పిల్లలు బాగా చదువుకోవాలి
మూడు ఎకరాల్లో కష్టపడి పండిస్తే ఏడాదికి రూ.90 వేలు మాత్రమే మిగులుతుంది. అంటే నెలకు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి
పట్టుదలగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మంచి జీతాలతో జీవితంలో స్థిరపడవచ్చు
అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోండి
పిల్లలు బాగా చదువుకుని జీవితంలో స్థరపడితే తల్లిదండ్రులకు పండగే
ఈ విద్యాసంవత్సరంలో 10 వ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
డ్రాపవుట్స్ లో ఎక్కువగా గిరిజన, దళిత చిన్నారులు ఉండటం బాధాకరం
బడి ఈడు కలిగిన ప్రతి బాలుడు, బాలిక స్కూలులో ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సహచర పిల్లలు కూడా బాధ్యత తీసుకోవాలి