నెల్లూరు ఏఎంసీ ఛైర్మన్గా ఏసునాయుడు
నెల్లూరు, జనవరి 10, (రవికిరణాలు) : నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా వైసీపీ రూరల్ దళిత నాయకుడు ఎంబేటి ఏసునాయుడు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ గౌరవాధ్యక్షుడుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉంటారు. ఉపాధ్యక్షుడిగా ఆరగుంట శారద, సభ్యులుగా నాపా సుబ్బారావు, మనుబోలు శ్రీధర్ రెడ్డి, గుద్దేటి విజయలక్ష్మీ, కుండా మురళీ కుమార్ రెడ్డి, చింతా ప్రశాంతి, మన్నెం చిట్టిబాబు, ముత్యాల సంధ్య, రాపూరు చంద్రశేఖర్, పొణకా ప్రతిమ, ముక్కం నాగేశ్వరరావు, మంచికంటి శ్రీనివాసులు, ఉప్పు నవిత, ఉప్పు ప్రసన్నలను నియమించారు. కలివెలపాళెం సొసైటీ అధ్యక్షుడు మార్కెంటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, నెల్లూరు కార్పోరేషన్ ఆఫీసర్ కూడా ఈ కమిటీలో సభ్యులుగా వుంటారు. నెల్లూరు మార్కెటింగ్ సొసైటీకి దళిత వర్గానికి
చెందిన ఏసునాయుడుని నియమించడం ఇదే ప్రధమం. గత 30 ఏళ్ళుగా ఏసునాయుడు రాజకీయాల్లో ఉన్నా, మొదటిసారి ఆయనను ప్రభుత్వ పరంగా ఒక పదవిలో నియమించినందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు, నెల్లూరు రూరల్ దళిత సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.