రూ.3.62 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన
నెల్లూరు నగరంలోని 4౦వ డివిజన్ మూలాపేటలోని అలంకార్ సెంటర్, చమండివారితోట ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పి.రూప్ కుమార్ యాదవ్, అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం చమండివారితోట నందు గల రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ సెంటర్ లో 13, 14, 15, 16, 40, 41, 42 డివిజన్ లకు సంబంధించి రూ.౩.62 కోట్లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్లు, డ్రెయిన్ లు, కల్వర్ట్ ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, చాట్ల నరసింహా రావు, నూనె మల్లికార్జున, గోగుల నాగరాజు, మిద్దె మురళీకృష్ణ యాదవ్, వడ్లమూడి చంద్ర, అల్లంపాటి జనార్ధన్ రెడ్డి, తాటిపర్తి సునీల్, జంగాల కిరణ్ కుమార్, సిహెచ్. కుమార్, సుధీర్ (చిట్టి), లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, కిన్నెర ప్రసాద్, ధనుంజయ, గంగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.