తెల్లరాయి ట్రాక్టర్ల పై ఎస్సై కి సవతి ప్రేమ

అయిన వారికి రెడ్ కార్పెట్..కానీ వారికి కేసులు బహుమానం





సైదాపురం 24 మేజర్ న్యూస్

సైదాపురం ఎస్సై కాంతి కుమార్ తెల్లరాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారని అందరూ అనుకున్నా అది పొరపాటే..గత మూడు రోజుల క్రితం తిప్ప వద్ద నుంచి రెండు ట్రాక్టర్లల్లో తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారంటూ ఎస్సై కి వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించి మైనింగ్ వారికి రాయకుండా డైరెక్ట్ గా కోర్ట్ కి పెట్టారు..అయితే రెండు రోజుల క్రితం మరో ట్రాక్టర్ లో తెల్లరాయి తరులుతుంది అన్న సమాచారంతో ఆ ట్రాక్టర్ ను పట్టుకున్న ఎస్సై ట్రాక్టర్ యజమాని తో సన్నిహితమో..లేకుంటే మమ్ముల్లో తెలియదు కాని ఆ ట్రాక్టర్ ను నేరుగా సంబంధిత తెల్లరాయి యార్డు కి పోలీస్ సిబ్బందిని పంపి రాయి ని ఆన్ లోడ్ చేపించి ట్రాక్టర్ ని మాత్రమే స్టేషన్ ముందు చూపూడికి పెట్టాడు..దాని పై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయిన వారు చేస్తే తప్పు కాదు..ఇంకా ఎవరైనా చేస్తే కేసులు మోపడం ఎంత వరకు సబబు తెల్ల రాయి ట్రాక్టర్ను పట్టుకొని నామ్ కా వాస్తుగా రాత్రిపూట వదిలేసిన ఎస్సై విలేకరులు ఫోన్ చేసి అడగగా మైనింగ్ రిలీజింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు నేను వదిలేసా అంటున్న ఎస్ఐ క్రాంతి కుమార్ అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఉన్నతాధికారులు సైదాపురం పై ప్రత్యేక దృష్టి సారిస్తే ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని మండల ప్రజలు కోరుతున్నారు..