నీటిపారుదల  కాలవలు పై ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించాలి 







 కొడవలూరు మేజర్ న్యూస్...


 కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరకటి మల్లికార్జున మాట్లాడుతూ  నీటిపారుదల శాఖకు సంబంధించిన కాలువలు తలమంచి కాలువ అయితేనేమి బొబ్బరు కాలువ అయితేనేమి వరవ కాలువ  ఆక్రమణలకు గురి అయి ఉన్నాయని ఇటీవల కోవూరు నియోజక వర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవ తో కొన్ని కాలువలు పూడిక తీయడం జరిగిందని ఈ ఆక్రమించి కాలువలపై శాశ్వత కట్టడాలు కట్టుకున్న వాటిని కూడా నీటిపారుదల శాఖ అధికారులు  వెంటనే తొలగించి నీరు పోయే ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం అని   రైతులకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడికి అక్కడ కాలువలు పూడ్చి  వేశారని ఈ నీటిపారుదల కాలువలకు గ్రామంలో ఉన్న డ్రైనేజీ మొత్తం కాలువలకు వదులుతున్నారని ఆ నీటిలో పంటలు పండించడం రైతులకు కత్తి మీద సాములగా తయారయ్యి   చాలా ఇబ్బందికరంగా ఉందని ఆ డ్రైనేజీ ఇరిగేషన్ కాలువలకు పెట్టకుండా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని వర్షాలు వచ్చి వరదల లాంటివి వచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోవడం ఖాయమని  తెలియజేశారు.


 బైట్  తువ్వర ప్రవీణ్ :- ఈ నీటిపారుదల కాలువలకు డ్రైనేజీ కలపడం ఎంతో దారుణమైన విషయమని ఆ డ్రైనేజీ వల్ల రైతులు ఆ నీటిలో దిగడానికి కూడా ఇష్టపడడం లేదని రైతుల పంటలు పండించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు చొరవ  తీసుకొని ఆ డ్రైనేజీ కాలువలు కలపకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.