జెఏసి చైర్మన్ ను సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు
జెఏసి చైర్మన్ ను సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు
రవికిరణాలుప్రతినిధి-దొరవారిసత్రంన్యూస్ :-అమరావతి జెఎసి చైర్మన్, దొరవారిసత్రం తహసీల్దార్ గోపిరెడ్డిని సూళ్ళూరుపేట ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మంగళవారం సన్మానించారు. దొరవారిసత్రం తాసిల్దార్ కార్యాలయంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శాలువాతోపూలమాలలతో ఆయనను సన్మానించారు. అనంతరం ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శీనయ్య మాట్లాడుతూ గోపిరెడ్డి తిరుపతి జిల్లా జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత యూనియన్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, గోపిరెడ్డి సహకారంతో త్వరగతిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎపిపిటిడి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శీనయ్య, సెక్రటరీ జయరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జిల్లా నాయకులు బిఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు