న్యూ ఢిల్లీలో బాలల పురస్కార్ అవార్డును అందుకున్న ఏకొల్లు సర్పంచ్ బ్లేస్సి .

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న సర్పంచ్.

దొరవారి సత్రం, రవికిరణాలు:-

మండలంలోని ఏకొల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ ఆవుల బ్లేస్సి కి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల కోసం ఆమె చేసిన సేవలను గుర్తించి న్యూఢిల్లీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరసింహ  చేతుల మీదుగా బాలల పురస్కారం అవార్డును మరియు ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరసింహ ఏకొల్లు సర్పంచి బ్లేస్సిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 110 నామినేషన్లలో ప్రథమ స్థానానికి తెలుగు వారు ఎన్నిక కావడం ఆనందంగా ఉందని, మా తెలుగువారు ఈ ఘనత సాధించడం నాకు చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం ఏకొల్లు సర్పంచి బ్లేస్సి ప్రసంగిస్తూ నేను ఈ అవార్డును అందుకోవడం తిరుపతి జిల్లా అధికారులైన జిల్లా కలెక్టర్ కే వెంకటరమణారెడ్డి, డి పి ఓ, డిఎల్పిఓ, తహసిల్దార్ పెళ్లూరు గోపిరెడ్డి, ఎంపీడీవో సింగయ్య, సెక్రటరీ ల సహకారంతో మండలంలో ఎన్నో అభివృద్ధి చేసి సాధించామని అందువలన ఈ అవార్డు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో   సుప్రీంకోర్టు జడ్జిలు, న్యూఢిల్లీ హైకోర్టు జడ్జిలు, ఢిల్లీ చిల్డ్రన్స్ కమిషనర్ పలువురు దేశ ప్రముఖులు పాల్గొన్నారు.