జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి

... సేవాదళ్ రాష్ట్ర పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు

... మాళెం సుధీర్ కుమార్ రెడ్డి

ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని మరోసారి 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ లో మార్కెట్ లో సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ పరిశీలకులుగా నియమించారన్నారు.

అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనపై ఎంత నమ్మకం ఉంచి నియమించినందుకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ లను మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ్ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు