- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్
నెల్లూరు, జనవరి 30, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ వేణుగోపాల్ నగర్, సింహపురి కాలనీ, జాఫర్ సాహెబ్ కాలువకట్ట ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగరానికి సంబంధించి వారంలోపు 75 నుంచి 80 కోట్లతో, అలాగే ఫిబ్రవరి 15 లోపు దాదాపు 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారో.. పింఛన్ల కోసం గంటల తరబడి వేచి ఉ ండాల్సిన అవసరం లేకుండ మార్చి 1 నుంచి నేరుగా ఇంటికి వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందన్నారు. రానున్న
రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేపట్టబోతున్నారన్నారు. నెల్లూరు నగరానికి సంబంధించి సుందరీకరణ నుంచి ట్రాఫిక్ సమస్య వరకు అన్నింటిపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. త్వరలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలు కూడ సహకరించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు సంక్రాంతి కళ్యాణ్, ఈటె మల్లికార్జున, ఎం.సుబ్బారావు, అక్బర్, నాగరాజు, నవీన్, ఎస్. వెంకటేశ్వర్లు, వెంకట్రావు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, యర్రంరెడ్డి మాధవరెడ్డి, లెక్కల వెంకారెడ్డి, హాలీవుడ్ మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.