విద్యా రంగం,ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయాలి




నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 

నెల్లూరు లోని సిపిఎం పార్టీ ఆఫీస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, విద్యారంగం - ప్రభుత్వ విద్యా సంస్థల పై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యారంగం దారి-తెన్నూలేని ఒక అస్తవ్యస్త స్థితిలో ఉందని ఒక వైపు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో ఆర్బాటాలే తప్ప నిర్మాణాత్మక ప్రస్తావన లేదు అని ప్రభుత్వాలు మారినప్పుడల్లా హడావుడిగా మార్పులు తేవడం, ప్రపంచ బ్యాంకు నిర్దేశాలకు లోబడటం,కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని నెత్తికెత్తుకోవడం, ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు భవిష్యత్ తరాన్ని అప్పజెప్పడం వంటి అప్రజాస్వమ్య  ఏకపక్ష ధోరణులు ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయిందని తెలిపారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం కాలం చెల్లిన చాందసాన్ని, కాషాయా అజెండాని రుద్దడం తో పాటు రాజ్యాంగం లోని ఫెడరల్ స్ఫూర్తి తీవ్రంగా దెబ్బతీస్తోంది అని తెలిపారు.

గత ప్రభుత్వం వచ్చి రాగానే ఒక 117 తెచ్చి ప్రాథమిక పాఠశాల వ్యవస్థని అతలాకోతలను చేసి లక్షల మంది పిల్లల్ని బలవంతంగా ఉన్నచోట నుంచి తరలించింది తెలుగు మీడియం రద్దు చేసి అనేక మార్పులు చేసింది ఇదంతా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే జరిగింది దీని అసలు లక్ష్యం ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం పాఠశాలలను కుదించడం. ఏ రాష్ట్రంలో లేనట్టు దాదాపు 50 శాతం పిల్లలు పాఠశాల విద్యలో ప్రైవేట్ బాట పట్టారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్నంత సవరిస్తామని చెప్పి ఉపాధ్యాయ సంఘాలతో మరో వైపు చర్చలు జరుపుతూ పాత విధాలు అన్నిటిని కొనసాగిస్తుంది.

ఇంటర్మీడియట్ విద్యకు వస్తే విద్యారంగాన్ని పరిశీలిస్తే పెద్ద ఎత్తున కార్పొరేట్ చేతుల్లో కేంద్రీకృతమై ఉందనీ, ప్రఖ్యాతిగాంచిన సంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య పేరుతో లక్షలాదిమంది విద్యార్థులకు ఆశ చూపి పెద్ద ఎత్తున కార్పొరేట్ కళాశాలలో వ్యాపారం చేస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని తెలిపారు.

రాష్ట్రం లో విద్యా రంగ ంలో కళాశాలలు కేవలం 169 మాత్రమే ఉండడంతో అందులో చదువుతున్నవారు 80 వేలకు ఉంచడం లేదు నామమాత్రపు బడ్జెట్ కేటాయింపు లు ఈరంగం నిర్వీర్యం అయిపోయింది దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.

వీసీల నియామకంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గైడ్ లైన్స్, రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి అని పైగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో సుమారు 5వేల ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేషన్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విశ్వవిద్యాలయాలు కూడా వ్యాపార దృష్టికి పెంచుకుంటున్నాయి ఆందోళన వ్యక్తం చేశారు.

వి శ్రీనివాసరావు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలనీ డిమాండ్ చేస్తూ జాతీయ విద్యా విధానం 2020 అమల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగే దిశగా ప్రయత్నాలు చేయాలని, డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, కార్పొరేట్ విద్యారంగంపై నియంత్రణ ఉండాలని, అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ మరియు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, వైస్ ఛాన్సలర్ మరియు ఇతర అధికారులు నియామకాలు ప్రతిభకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మతపరమైన నియమాలని నిలిపివేయాలి అని, ఇతర విద్యా విధానంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కార్పొరేట్ దోపిడీని నియంత్రించాలని, విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, అన్ని విభాగాల్లోని ప్రభుత్వ కళాశాలలో లేబరేటరీ సౌకర్యాలు కల్పించాలని,కాంట్రాక్ట్ లెక్చరర్లు మరియు టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్య నేర్పాలి అని,ఉన్నత తరగతుల్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి  వి.శ్రీనివాసరావు,మూలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.