పారిశ్రామిక వాడల్లో బీసీలకు 50% రాయితీ ఇవ్వాలి డాక్టర్ మహేంద్ర యాదవ్ 

 



నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ 

ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక వాడల్లో (Apiic) లో ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల (MSME)లో కేటాయించే భూ విలువల లో బడుగు బలహీన వర్గాలకు (బీసీ )లకు 50% సబ్సిడీ ఇవ్వాలని బీసీ నేత,బీజేపీ నాయకులు డాక్టర్ ఒంటేరు మహేంద్ర యాదవ్ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ లకు మాత్రమే రాయితీ ఇస్తున్నారు అని- బీసీ లకు కూడా అదే క్రమంలో సబ్సిడీ ఇచ్చి బడుగు బలహీన వర్గాల లో పారిశ్రామిక వేత్తలను ప్రోస్తహించాలని డిమాండ్ చేశారు.. తెలుగు దేశం బీసీ ల పార్టీ గా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ లకు ప్రత్యేక పారిశ్రామిక చట్టం ఏర్పాటు చేసి వారి అభ్యున్నతి కి పాటు పడాలని కొరారు..నూతన ప్రభుత్వం లో కూడా గత ప్రభుత్వంలో ఉన్న పారిశ్రామిక పాలసీ లే అమలు అవుతున్నాయి అని గుర్తు చేశారు..కొత్త పారిశ్రామిక విధానం ఏర్పాటు చేసి బీసీ లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు..