ఘనంగా డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ 115 వ జన్మదిన వేడుకలు: బిజెపి కావలి పట్టణ శాఖ
ఘనంగా డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ 115 వ జన్మదిన వేడుకలు: బిజెపి కావలి పట్టణ శాఖ
భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టు బోయిన బ్రహ్మానందం అధ్యక్షతన ఈరోజు కావలి పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టు బోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్. జగ్జీవన్ బిహార్‌లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవిం చాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.
ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.
జగ్జీవన్ రామ్ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. అంతటి కష్టకాలంలో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది. 52 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి స్వాతంత్య్ర సమరయోధుడు.
వివక్షను ఎదుర్కొంటూ ఉపప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్‌రామ్ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జూలై 6న పరమపదించారు. దళితుల హక్కులను రాజ్యాం గంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్‌రామ్ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు సుభాషిణి మాట్లాడుతూ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళి అని తెలిపారు.భారతీయ జనతాపార్టీ ఆయన ఆశయాలు కొనసాగిస్తుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కావలి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ కన్వీనర్ సివిసి సత్యం మాట్లాడుతూ పేద ప్రజలు అభ్యున్నతి కొరకు నిరంతరం కృషి చేసిన మహనీయులు అని తెలిపారు.అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు .ఆయన దేశానికి చేసిన సేవలు మనం నిత్యం గుర్తుచేసుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు బాలు యాదవ్,లక్కరాజు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వాయుగండ్ల సుధీర్, మంద కిరణ్ కుమార్,కార్యదర్శి సుందర సెట్టి సుజి, ట్రేజరర్ ఎం.కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు పరుసు వేంకటేశ్వర్లు,యస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దారా శ్రీనివాసులు ,బీజేవయ్యేం జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శివప్రసాద్,యస్సీ మోర్ఛ జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు, యస్సీ మోర్ఛ పట్టణ అధ్యక్షులు జలదంకి విజయ్ కుమార్, బీజేవయ్యేం పట్టణ ప్రధాన కార్యదర్శి కురకులా సవిండ్ర,అక్కిలగుంట జీవ,కిసాన్ మోర్ఛ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చంద్ర శేఖర్, కిసాన్ మోర్ఛ పట్టణ అధ్యక్షులు తిరుపతి స్వామి,దామోదర్ నాయుడు, కేతిరెడ్డి విష్ణు తేజ రెడ్డి,మర్రిబోయిన అనిత,సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.