పేటలో ఘనంగా డౌన్ సిండ్రోమ్ దినోత్సవం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట :  పట్టణంలోని  భవిత కేంద్రం నందు మండల విద్యాశాఖాధికారి  ఆధ్వర్యంలో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి సహకారంతో డౌన్ సిండ్రోమ్ దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భార్గవి మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాని ఇంపార్టెన్స్ , వారి లక్షణాలు ఎలా ఉంటాయి ,ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి వీటన్నింటి గురించి క్షుణ్ణంగావివరించారు .తదుపరి MEO  మాట్లాడుతూ దేవుడి  సేవకంటే దివ్యమైనది దివ్యాంగుల సేవ అని కొనియాడారు.అనంతరం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు చంద్రబాబు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయడం ఒక గొప్ప వరం అని అన్నారు.ఈ సందర్భంగా ఆచార్య భరద్వాజ సేవాసంస్థ వారు పిల్లలందికీ బిస్కెట్లు,పండ్లు,పలకలు,బలపాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య భరద్వాజ సేవాసంస్థ సభ్యులు అశోక్ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.